అదృష్టం – దురదృష్టం – జీవితం

అదృష్టం – మనల్ని ప్రేమించే వాళ్ళు మన చెంత ఉండడం
దురదృష్టం – ప్రేమిస్తున్నట్టు భ్రమ సృష్టించి మనకు విలువ, మన మాటలకు గౌరవం ఇవ్వని వాళ్ళను చెంత చేరనీయడం

దురదృష్టం వల్ల అదృష్టం మాసిపోదు
అదృష్టం వల్ల దురదృష్టం కానరాకుండాపోదు

అదృష్టం జీవితాన్ని ఆనందంగా జీవించే స్పూర్తినిస్తుంది
దురదృష్టం జీవితంలోని చేదు అనుభవాలను ఎదుర్కొని ముందున్న అదృష్టాలను అన్వేషించాలన్న గుణపాఠాన్ని మర్మంగా ఉంచుతుంది

అది గ్రహించి ముందుకు వెళ్లగలిగితే జీవితంలోని పరమానందాన్ని అందుకునే అవకాశం లభిస్తుంది
నిగ్రహంగా ఆగ్రహావేశాలకు దాసోహమవ్వక లాభామాశించక నష్టాన్ని ఇష్టమైనంత కుదించి నిరీక్షించాలి

కపట మాటల తూటాలతో కర్కశ కాట్లతో మనోభావాలని మోదుతుంటే తట్టుకుని ఉండడం తప్పనిసరి!
ఎడారిలో ఎండకు ఆవిరవ్వక ఎండమావులచే వంచించబడక బీడుబారిన గుండెలకు సైతం ఊపిరి లాంటి జీవ జలాలకై శోధించాలి
జీవన పోరాటంలో విజయభేరీ మ్రోగేవరకు వెనుకంజ వెకిలిగా నవ్వినా పెడచెవిన పెట్టి కాలుదువ్వాలి!
వెర్రి చేష్టలతో విర్రవీగే వంచకులెందరున్నా, కునుకు కరువైన కళ్ళతో క్రోధాన్ని కబళించి కాళరాతిరైనా కాలయాపన చేయాలి!
కల్పతరువువంటి జీవితాన్ని వెలికితీయాలి! జీవేచ్ఛను ప్రబలించాలి!!

ఏప్రిల్ 25, 2017 at 10:36 సా. వ్యాఖ్యానించండి

కల ‘వరం’

నిశి రాతిరి వేళ …
పరులెటులనున్నా…
తను మాత్రం రాజునని తలచె … ఒక నరుడు
కట్టడాలు, ఆనకట్టలు, బలగాలతో … రాజ్యాన్ని నిర్మించసాగె
యుద్ధాలు ప్రకటించె … ప్రబుద్ధులను సైతం వణికించె …
అఖండ మండలాలను సైతం తన సైన్యముతో సమూహముగా …
ఒక పటముపై అద్బుతంగా సకల వర్ణములతో గీసిన బొమ్మలా …
రాగాన్వేషణతో తపించిపోయే గాయకుడు నిర్విరామముగా ఆలపించే పాటలా … పాలించెను!
సృష్టికర్త గర్వించదగ్గ స్థాయిలో నింగినంటే సింహాసనమును అధిరోహించగా …
అంతకంటే ఎత్తులో తానున్నానంటూ కన్నెర్రజేసి …
నిశిని అంతము చేయుచు తన ఉణికిని చాటిచెప్పెను …
ఆ రాజు సృష్టించుకున్న రాజ్యాన్ని నేలరాల్చె …
ప్రస్థానానికి ప్రతినాయకుడు కూడా వచ్చెనని చెప్పెను ఉదయభానుడు!
ఆ గాయకుని రాగం మూగబోయేట్టు గంట కొట్టెను గడియారం!!

డిసెంబర్ 17, 2012 at 9:42 ఉద. 1 వ్యాఖ్య

అమితమైన ప్రలాపం

మృదు మోముతో మురిపెముగా మది దోచగా
అమృత వాక్కులు వెలువడెను ఈ గాత్రమున!!
సుందర వదనమున దాగి ఉంది మత్తు.. గమ్మత్తైన విపత్తు!
ఈ వృత్తాంతమునకు ఆకృతినీయుచు రచించెనీ గానమును!!
శృతిలో ఈ కృతినాలపించగా…
కర్ణమునకు వర్ణనాతీతానుభుతి!!
చెదరని చిరునవ్వుతో…
నివ్వెరబోయె నయనం!!
మధురమైన పలుకులు…
ఈ హృదయమందు పదిలం!!
ఊహలను అల్లికగా మలచి…
నిర్విరామముగా నివేదించ కృషిచేసినా…
తుది తోచలేదు!
ఇది నిరంతరం తీరం తాకే తరంగం!
నిష్క్రమించని తలపుల తరంగం!!
ఎంత ప్రయాణించినా చేరలేని గమ్యం!
ఎంత ప్రయాసపడినా పూర్తిచేయలేని కావ్యం!!

ఫిబ్రవరి 23, 2012 at 12:16 ఉద. 1 వ్యాఖ్య

మంచు!

మెల్లగా నేల రాలింది…
తెల్లగా అల్లుకుంది….
మబ్బులా కాదు… పొగ మంచులా!

ఆకాశమంతా నిండినది!
కొత్త కాంతితో…

నేలకొరిగి నవ రూపాన్ని అద్దినది!
స్వేతాక్షత బిందువులతో…

ఆ వర్ణము వర్ణించే రాగమై..
నటనమాడెను..భువనవీణపై!

లావణ్యానికి అర్ధం తెలుపుతూ…
మునుపు లేని గిలిగింత పెట్టినది!

ఆ మంచు తునకలు కరిగినా…
ఆ ఛాయలు కనుమరుగయినా…
ఆ చూపులు పదిలమై ఉండును!
ఈ నయనమున!!
కనువిందుగ కొలువుండును!
ఈ హృదయమున!!

ఆగస్ట్ 23, 2011 at 12:13 ఉద. 2 వ్యాఖ్యలు

ఆ క్షణం…

నీ తలపులు నా తనువీణను మీటుతుంటే…
నీ జ్ఞాపకాల గునపం గుండెను గిల్లుతుంటే…
దూరమవుతున్న తరుణం వేదనే ఓదార్పునీయునా?
ఆశలు అడియాశలవుతున్న వేళ…
చెంతకొచ్చావు చల్ల గాలిలా!
కలల తీరానికి దర్శనం ఇస్తావని…
నా నిరీక్షణ కడతేరుతున్న క్షణం…
చూస్తుండిపోయాను నీ రూపం!
నా చూపుల సంద్రంలో ధూళి నిండినదో ఏమో…
చేమ్మగిల్లెను చూపులు!!
మసకబారిన కళ్ళకు ఓపిక లేక…
మునివేళ్ళ సాయం కోరెను!
నీ రూపాల కాంతులు నా నయనాలను చేరడానికి!!
చేరి చిరకాలం చెరిగిపోకుండా ఉంటే…
నా గుండెలోతుల్లో ప్రతిధ్వనించే నినాదం…
‘గెలుపు నాదే!’ 🙂

మార్చి 19, 2011 at 11:19 ఉద. 16 వ్యాఖ్యలు

కాలం సాగిపోతుంది…

ప్రతీ పదం పలుకబడదు…
ప్రతీ భావం కనపడదు
ప్రతీ క్షణం మదిలో నిలువదు

కాలం సాగిపోతుంది…
సాగిపోతూనే ఉంటుంది…

కొన్ని సార్లు మెల్లగా మారవచ్చు…
ఏదైనా జరగడానికి మనం వేచియున్నప్పుడు…
ఆ నిరీక్షణలో మునిగితేలడానికి!!

ప్రతీ పదం పలుకబడదు…
ప్రతీ భావం కనపడదు
ప్రతీ క్షణం మదిలో నిలువదు

ఏకసంతాగ్రహి అయినా ఏకాగ్రతతో
కార్య సిద్ధికై కృషిచేస్తున్నా
కొన్ని సార్లు కాలమే వంచించును!!

కాలం సాగిపోతుంది…
సాగిపోతూనే ఉంటుంది…

కాబట్టి…
కనుమరుగవ్వని క్షణాలు నెమరువేసుకుంటూ…
గుండెలోతుల్లో ప్రతిధ్వనించే పదాలు పలకాలి!
గత వైభవం గుర్తుచేసుకుంటూ…
అమూల్యమైన ఆలోచనలు రాసుకోవాలి!
మధురోన్నత భావాలను తలచుకుంటూ…
మరో కావ్యమే వెలికితీయాలి!
పాత రోజులను తిరిగి చూసుకోవాలి!!
ఒక గాధలా మలుచుకోవాలి!!

ఆనాడు.. ఈనాడు.. ఏనాడూ..
చరిత్రలో చిరకాలం నిలిచిపోవాలి!!

జనవరి 22, 2011 at 11:25 సా. 2 వ్యాఖ్యలు

తొలి పొద్దు

పొద్దే ‘పొడిచెను’ చీకటి రేయిని…
నిదురించే నడి రేయిని!
హద్దే చెరిపెను భూ మర్మముకు…
అందమైన మృదు మర్మముకు!
ముద్దు పెట్టెను ప్రకృతి నుదుటిపై సింధూరంలా…
విరిసే ఎర్రని ముద్ద మందారంలా!
చంద్రున్నే మరిపించే వెలుగులతో…
కోటి వెలుగులతో…
దిద్దేను పుత్తడి వర్ణము నింగి వెలుపల!
అలలు పారగా… కోకిల పాడగా…
నవోదయమే పిలిచెను వెచ్చగా!
కలలే కడ తేరెను కనులెదురుగా…
వాయువేగంతో ఎగిరి వచ్చిన వాన మేఘంలా!
కలలు దాటి వచ్చెను ఆశల సవ్వడి…
చిటపట రాలిన చిరు చినుకులా!
ఆ ఆకాంక్ష చేసెను సందడి…
కొంటె భాషలో కొత్త బాసలా!

అక్టోబర్ 27, 2010 at 4:18 సా. 10 వ్యాఖ్యలు

చిత్ర లేఖనం – 5, 6

జూలై 11, 2010 at 6:00 సా. వ్యాఖ్యానించండి

ఉదయ కాంతిలా..

ఉదయ కాంతిలా
హృదయ లయలు…
పల్లవించెను పాటలా
మధువులూరే గానమై
మెదలసాగెను స్వరములో
స్మృతులే..
సంకృతులుగా
(ఉదయ..)
————————–
కనుల వాకిట విచ్చేసిన
కలలే అలలుగా
చేరెను తీరము
జీవనది తీరము!
నిదుర సంద్రమునించి
నిజ జీవితముకు..
అలుపు మాని గెలుపు కొఱకు!!
(ఉదయ..)
—————————
నింగికెగసే ఆశలే
నేర్పుచుండెను ఓర్పునే
మదిలోని మృదు బాసలే
మారుచుండెను ప్రాసలా!
కంఠమే కావ్యమవగా
ఆలకించుము ఈ గాత్రమును!!
(ఉదయ..)
—————————
హృదయపు కాగితముపై
ఊసుల వర్ణము కల్గిన కలముతో
వ్రాయసాగెను మరో గ్రంధమిలా
మోయలేని స్తోత్రములే
మరువలేని పురానముగా
ఇంకిపోయేట్లు లిఖించెను
ఈ కవి లిఖించెను

జూలై 9, 2010 at 2:32 సా. వ్యాఖ్యానించండి

చెక్కిలి దాహం

నీ తలపులు నా వాకిట తలుపులు తడుతుంటే

సంతోషం ఒక పక్క
బాధ మరో పక్క

ఆనందం ఎందుకంటే …

నిన్నింతలా ప్రేమించే హృదయం…
నీ మరపురాని జ్ఞాపకాలు…
నా చెంతనున్నందుకు!
దుఃఖం ఎందుకంటే …
వీటన్నిటికీ మూలం ఐన నీవు
నన్నింతలా మార్చి
ఇంత ధైర్యం ఇచ్చిన తరువాత
నను వదిలి వెళ్ళినందుకు!
ఇచట లేనందుకు!!
అటువంటి తరుణం …
చూసుకుంటే నా ప్రతిబింబం …
రోదించనంది ఈ నయనం!!
కంట తడి రాని క్షణం
తీర్చేది ఎవరు చెక్కిలి దాహం?

ఏప్రిల్ 14, 2010 at 7:31 ఉద. 2 వ్యాఖ్యలు

Older Posts


Blog Stats

  • 4,564 hits

లంకెలు

ఏప్రిల్ 2024
సో మం బు గు శు
 123456
78910111213
14151617181920
21222324252627
282930