Archive for ఏప్రిల్, 2009

పేరు లేని ఒక కవిత

కొంటె గాలిలా గిల్లిపోకు
కనుపాపలో కలవైపో…
మెరుపులా వచ్చి మాయమైపోకు
మదిలోతులో కొలువుండిపో…
మంచుబిందువులా వచ్చి కరిగిపోకు
మైమరపులోకి నను తీసుకుపో…
కునుకుపాటులో కనుమరుగైపోకు
చిరునవ్వులా చిరకాలం ఉండిపో…
చీకటిలో జాబిలిలా
నువ్వు వెలిగిపో…
శలయేటిలో అలలా
నను తాకిపో…
నే రాసే ప్రతి పాటలో ఉండిపో…
నా ప్రతి అక్షరంలో ఇమిడిపో…
మురిపించే గతంలా నను అల్లుకుపో…

ఏప్రిల్ 22, 2009 at 7:30 సా. 2 వ్యాఖ్యలు


Blog Stats

  • 4,565 hits

లంకెలు

ఏప్రిల్ 2009
సో మం బు గు శు
 1234
567891011
12131415161718
19202122232425
2627282930