Archive for నవంబర్, 2008

అంతం…ఎప్పుడు? ఎక్కడ?

పేరు ఒక చలనచిత్రంలోనిదే అయినా ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది.
భిన్నత్వం లో ఏకత్వానికి ప్రసిద్ధి చెందిన మన భరతమాత ఒడిలో మరో మారు రక్తపాతం జరిగింది.
ప్రశాంతంగా ప్రేమగా మసలుకొనే జీవులతో నిండిన మన దేశ వనములో ఉగ్రవాదపు మంట మళ్ళీ చెలరేగింది.
ప్రతిసారి దీని నుండి తాత్కలిక ముక్తి పొందుతున్నప్పటికీ శాశ్వతంగా దీనిని పారద్రోలటానికి ఏం చేయాలో ఇంతవరకూ చట్టానికీ మరియు రక్షన దళాలకీ పాలుపోలేదు.
ఎంతో మంది రక్షక భటులు శాంతిభద్రతలను నెలకొల్పటానికి తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. వీరిలో కొంతమంది దేశ పౌరులను రక్షించే కర్తవ్యంలో తమ ప్రాణాలు కొల్పోయారు.
ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అమాయక ప్రజలు భయభ్రాంతి చెందుతున్నారు.
పసి పిల్లలు, మహిళలతో సహా ఎంతో మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చేశారు!!
ప్రజలు తమ నిత్య జీవితంతో సంతోషంగా ఉండటాన్ని ఈ దుష్ట ఉగ్రవాదులు
చూసి ఓర్వలేక కపటం లేని కన్నులకు కంటతడి రుచి చూపిస్తున్నారు.
దీనిని అరికట్టాల్సిన కర్తవ్యం మనందరిది!!
ప్రజలకు ధైర్యం చెప్పటానికి ప్రధాని తదితర ప్రజా ప్రతినిధులు సంఘటన స్తలానికి రావటం, వారు తిరిగి వెళ్ళేదాకా వారికి రక్షణ కల్పిస్తూండటం ఎంతవరకు సబబు?
భద్రత లోపించింది అని ఆరోపించే బదులు దానిని సరి చెయటమే ఉత్తమం!!
ప్రతిపక్షాలు ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులను తప్పు బట్టడాన్ని మాని అందరూ కలిసి కట్టుగా కృషి చేయటమే మేలని నా అభిప్రాయం.

నవంబర్ 28, 2008 at 8:07 సా. వ్యాఖ్యానించండి


Blog Stats

  • 4,565 hits

లంకెలు

నవంబర్ 2008
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30