చిత్రలేఖనం – 3, 4

మరో ఆదివారం…మరో బొమ్మకి శ్రీకారం :)

బొమ్మ

బొమ్మ

పోయిన వారం గీసిన బొమ్మ :

బొమ్మ

బొమ్మ

ఫిబ్రవరి 15, 2010 at 12:21 ఉద. 2 వ్యాఖ్యలు

నా గిటార్

3 IDIOTS – ‘Give me some sunshine’ పాట గిటార్ మీద ఆదివారం నేను వాయించినప్పుడు record చేసిన video ఇది. ఈసారి video upload చేసే సరికి ఇంకా బాగా వాయించాలని నా ఆశ, కోరిక, తపన 🙂

ఫిబ్రవరి 4, 2010 at 12:15 ఉద. 6 వ్యాఖ్యలు

జో.. జో..

చుట్టూ ఉన్న ప్రపంచం తిరుగుతుంది…
మెదడులో ఆలోచనల అలజడి రేగుతునే ఉంది!
పరుగులు తీసే పగలైనా,
నిదురించే నడి రేయి అయినా…
ఈ అలజడి రేపే గోలను ఆపలేవు!
చెంతనుంటే ఆత్మీయులు,
దూరమైతే జ్ఞాపకాలు…
ఊసులు మరపించే తలపులై
ఈ హృదయపు తలుపులను
తట్టి కొడుతూ… ఉంటే…
చిచ్చు కొడుతూ జోల పాడుతుందో,
చిచ్చు రేపే పెను గోలలా వేధిస్తోందో,
దిక్కు తోచక…
తలుపు తెరవలేక…
పాపం పసి హృదయం!
నిద్ర పట్టక తల్లడిల్లింది!!

అప్పుడే అనిపించింది…
పెను జ్వాలకైనా ఆయువు పోసేది వాయువే అని!!
తనలోకి తొంగిచూడగా…
ఆశావాదాన్ని, ఆనందాన్ని
అపనమ్మకం, అనుమానం
హరించి వేస్తున్నాయని!
ధైర్యం కూడగట్టుకుని
బెదురుపాటుని దహించి వేస్తే…

మురిపించే తలపులతో
నవోదయ తేజస్సుని వీక్షిస్తూ…
చిరునవ్వులు మరళ చిగురించెను!
నిశ్శెబ్దాన్ని ప్రతిధ్వనిస్తూ
కునుకు వేశెను చిన్ని హృదయము 🙂

ఫిబ్రవరి 2, 2010 at 8:45 సా. 2 వ్యాఖ్యలు

పేరు ఇక్కడ లేదు :P

మిట్ట మధ్యాహ్నం బాగా తిన్న తరువాత
పాఠాలు వినడం అంటే
చిచ్చు కొడుతూ జోల పాడినట్లే
మధ్యలో ప్రశ్నలడగటం అంటే
పీడకల కొని తెచ్చుకున్నట్టే
నిద్రపోకూడదని కాఫీ తాగడం అంటే
మధ్యలో ఇలా పిచ్చి రాతలు వ్రాయటమే!!
ఇటువంటి సమయంలో చివరాఖరి చోటు దక్కడం అంటే
ఏ.సి. గదిలో రగ్గు దొరకడమే 😀
ఈ రాతల్లో పొంతనలు తికమకగా తలకిందులుగా ఉన్నాయంటే
సగం నిద్ర ఆవహించినట్టే
సరిగ్గా ఇలాంటప్పుడే అనిపిస్తుంటుంది…
కళ్ళు తెరిచి నిద్రించేవాళ్ళు ఎంత అదృష్టవంతులో!
మరి దురద్రుష్టవంతులెవరా అని ఆశ్చర్యపోతున్నారా?
గుర్రు పెట్టి మరీ నిద్రపోఎవాళ్ళు 😉

నిదురలో నివేదిక
(మత్తులో పడి పేరు కిందకు జారిపోయింది)

జనవరి 23, 2010 at 8:35 సా. 2 వ్యాఖ్యలు

ఒంటరి

ప్రేమ విత్తనం అలా వచ్చి ఈ గుండెపై వాలింది
అది పెద్ద చెట్టులా పెరిగి ఈ జీవితానికి జీవితాన్నే ఆస్వాదించే వరాన్ని ఇచ్చింది
కానీ ఒక రోజు…
దాన్ని తొలగించక తప్పలేదు..
ఆ యోచనే జీర్ణించుకోలేకపోయింది ఈ జీవితం
హడలిపోయిన హృదయం ఏమీ చేయలేక అలా నిర్జీవంగా ఉండిపోయింది
ఎంతో శ్రేమిస్తే గానీ ఆ చెట్టుని కూకటి వ్రేళ్ళతో పెకలించటం సాధ్యపడలేదు
అప్పుడే చూశాను…
ఆ వ్రేళ్ళు ఎంత లోతుగా ఈ గుండెలో పాతుకుపోయాయో … ఎంత ప్రశాంతంగా కలసి మెలసి ఉన్నాయో
కానీ వాటిని తొలగించిన మరు క్షణమే, గుండె బేలగా కనిపించింది
బాధతో రోదిస్తున్నట్లు అనిపించింది
ఆ వ్రేళ్ళు చేసిన రంధ్రాల నుండి రక్త కన్నీరు పారసాగింది
ఆ శోకము ఆగేనా? ఆ గాయాలు మానేనా?
ఏమో… కాలానికే తెలియాలి!!

జనవరి 21, 2010 at 12:06 ఉద. 2 వ్యాఖ్యలు

చిత్రలేఖనం – 2

మరో ఆదివారం…మరో బొమ్మకి శ్రీకారం 🙂

గులాబీ

గులాబీ


కొంచం తేడాగా ఉంది…కానీ గులాబీ గులాబీలానే వచ్చింది 😀

జనవరి 10, 2010 at 6:50 సా. 4 వ్యాఖ్యలు

చిత్రలేఖనం

కొత్త ఏడు… పునఃప్రారంభం 🙂
ఈ సందర్భంగా అనుకోకుండా మళ్లీ బొమ్మలు వేయడం మొదలుపెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది.
కొన్ని ఏళ్ళ తరువాత ఈ ఆదివారం మళ్లీ పెన్సిల్ పట్టుకుని బొమ్మ గీస్తే ఇదిగో…ఇలా వచ్చింది!!
ఎవరో కనుక్కోండి చూద్దాం ;)

జనవరి 6, 2010 at 11:42 సా. 10 వ్యాఖ్యలు

‘జీవిత’ ప్రతిధ్వని

నలుగురికి పంచేవాడికి మాత్రమే తెలుస్తుంది…
‘సంతోషం’ అన్న పదానికి సరిఅయిన అర్ధం 🙂
ఆ ‘సంతోషాన్ని’ అక్కున చేర్చుకున్న వాడికే తెలుస్తుంది…
‘జీవితం’ యొక్క పరమార్ధం!! 🙂
మరణానికి కూడా తావు లేదు…
ఆ వ్యక్తికి ‘భయాన్ని’ రుచి చూపే ధైర్యం!!
ఆ వ్యక్తిని ఎవరిలోనో వెతుకుట అవివేకం
వేచి చూచుట వ్యర్ధం!!
కరుణ లేని చోట, విలువలు లేని చోట
కీర్తి అనే పదానికే అపకీర్తి!!
ఊట బావిలో ‘మంచి’ నీటిలా
సూర్య కిరణాలలో తేజస్సులా
మానవత్వాన్ని, మంచిని
పంచేకొద్ది వచ్చేది అలసట కాదు…
తృప్తి!! ఆనందం!!

వెచ్చించే ధనానికి కాదు…
చేరుతున్న గమ్యానికి తెలుసు
అక్కడ ఏముందో! 🙂
ఆలోచించే మేధస్సుకు కాదు…
కొట్టుకునే హృదయానికి తెలుసు
అక్కడ ప్రతిధ్వనించే చప్పుడేంటో!! 🙂

డిసెంబర్ 14, 2009 at 8:32 సా. 6 వ్యాఖ్యలు

మనిషి -> ??

నువ్వే నా లోకం
ఐన తరుణం
నన్ను వదిలి వెళ్ళడం
ఎంత దారుణం!!
కానీ …
నేల రాలే ఆకుని చూసి
చెట్టు నీడను చులకన చేయడం
ఎంత మూర్ఖత్వం?
వాడిపోయే పూవుని తలచి
పూదోటనే కాదనుకోవడం
కాదా మూర్ఖత్వం?
అమావాస్య నిశీధిలో
నింగిని చూచి వగచి
సుర్యోదయన్నే చూడకపోవడం
ముమ్మాటికీ మూర్ఖత్వమే!!
కనుకనే ….
నువ్వు లేని జీవితం
నీ తలపులకు అర్పితం

ఎంతైనా…
నేనూ మూర్ఖున్నేగా 🙂
(అంటే.. మనిషినేగా :D)

డిసెంబర్ 10, 2009 at 8:33 ఉద. 3 వ్యాఖ్యలు

ఆనంద వనం

చెరిగిపోయిన గతమైనా…
మిగిలి ఉన్న ఘట్టం అయినా…
నీవే కదా నాకు తెలిపినది…

కన్నీరు విలువైనవని
వృధా చేయుట తగదని…
ఆశ అనెడి బీజానికి
పన్నీరు వలె ఆసరానిచ్చి
ఏదో ఒక రోజు ఒక మహా వృక్షముగా మార్చునని

కనుకనే ఈ గుండెలోకి తొంగి చూస్తే
కేరింతలు కొట్టే ఒక వనము కనిపించును 🙂
చప్పుడులేని ఈ కన్నీటి సంద్రములో
నవ జీవన వీణ మీటింది ఈ వనమే

ఎంత రక్తము ప్రవహించినా
ఈ గుండె గోడల్లో నీ పేరు కొట్టుకుపోదు
నా ప్రాణానికి హత్తుకుని ఉండి
ఒంటరితనాన్ని తుంటరిగా తరుముతుంది 😉

నవంబర్ 16, 2009 at 3:57 సా. వ్యాఖ్యానించండి

Older Posts Newer Posts


Blog Stats

  • 4,565 hits

లంకెలు

మే 2024
సో మం బు గు శు
 1234
567891011
12131415161718
19202122232425
262728293031