Archive for డిసెంబర్, 2009

‘జీవిత’ ప్రతిధ్వని

నలుగురికి పంచేవాడికి మాత్రమే తెలుస్తుంది…
‘సంతోషం’ అన్న పదానికి సరిఅయిన అర్ధం 🙂
ఆ ‘సంతోషాన్ని’ అక్కున చేర్చుకున్న వాడికే తెలుస్తుంది…
‘జీవితం’ యొక్క పరమార్ధం!! 🙂
మరణానికి కూడా తావు లేదు…
ఆ వ్యక్తికి ‘భయాన్ని’ రుచి చూపే ధైర్యం!!
ఆ వ్యక్తిని ఎవరిలోనో వెతుకుట అవివేకం
వేచి చూచుట వ్యర్ధం!!
కరుణ లేని చోట, విలువలు లేని చోట
కీర్తి అనే పదానికే అపకీర్తి!!
ఊట బావిలో ‘మంచి’ నీటిలా
సూర్య కిరణాలలో తేజస్సులా
మానవత్వాన్ని, మంచిని
పంచేకొద్ది వచ్చేది అలసట కాదు…
తృప్తి!! ఆనందం!!

వెచ్చించే ధనానికి కాదు…
చేరుతున్న గమ్యానికి తెలుసు
అక్కడ ఏముందో! 🙂
ఆలోచించే మేధస్సుకు కాదు…
కొట్టుకునే హృదయానికి తెలుసు
అక్కడ ప్రతిధ్వనించే చప్పుడేంటో!! 🙂

డిసెంబర్ 14, 2009 at 8:32 సా. 6 వ్యాఖ్యలు

మనిషి -> ??

నువ్వే నా లోకం
ఐన తరుణం
నన్ను వదిలి వెళ్ళడం
ఎంత దారుణం!!
కానీ …
నేల రాలే ఆకుని చూసి
చెట్టు నీడను చులకన చేయడం
ఎంత మూర్ఖత్వం?
వాడిపోయే పూవుని తలచి
పూదోటనే కాదనుకోవడం
కాదా మూర్ఖత్వం?
అమావాస్య నిశీధిలో
నింగిని చూచి వగచి
సుర్యోదయన్నే చూడకపోవడం
ముమ్మాటికీ మూర్ఖత్వమే!!
కనుకనే ….
నువ్వు లేని జీవితం
నీ తలపులకు అర్పితం

ఎంతైనా…
నేనూ మూర్ఖున్నేగా 🙂
(అంటే.. మనిషినేగా :D)

డిసెంబర్ 10, 2009 at 8:33 ఉద. 3 వ్యాఖ్యలు


Blog Stats

  • 4,565 hits

లంకెలు

డిసెంబర్ 2009
సో మం బు గు శు
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031