Archive for ఫిబ్రవరి, 2009

ఆయనే ఉంటే :P

మా పెదనాన్న వాళ్ళ అబ్బాయికి మరియు బాబాయికి మధ్య phoneలో జరిగిన సంభాషణ ఇది…

బాబాయి : ఏ రా…lecturer ఉద్యోగం వచ్చింది అంటగా…మరి నాకు నీ మొదటి నెల జీతం ఇస్తావా?
అబ్బాయి : నాకు ఖర్చులు ఉన్నాయి బాబాయి
బాబాయి : ఏం ఉన్నాయి ఏంటి?
అబ్బాయి : కొంత డబ్బు పోగేసి నేను bike కొందాం అనుకుంటున్నా
బాబాయి : మీ నాన్న బండి తీసుకెల్లచ్చుగా?
అబ్బాయి : మరి నాన్నకి ?
బాబాయి : కొత్తది కొనుక్కుంటాడులే.. 😛
అబ్బాయి : ఆయనే ఉంటే తెల్ల చీర ఎందుకు? 😀

ఫిబ్రవరి 27, 2009 at 5:32 సా. 2 వ్యాఖ్యలు

నీ కోసం…

నీ చిరునవ్వుని తలచుకుని
ఎన్ని మరిచానో…
మైమరచిపోయానో…
నీ జ్ఞాపకాల వలయంలో చిక్కుకుని
ఎన్ని ఎడారులు దాటానో…
ఎన్ని సంద్రాలు ఈదానో…
ఎప్పటికి నిన్ను చేరెదనో తెలియక
తరగని దూరాన్ని దాటలేక
చంద్రుని కోసం చుక్కలా
వాన కోసం వనంలా
కనిపెట్టుకుని ఉన్నాను నేను
నీ పిలుపు కోసం
నీకై వేచియున్న చూపులకు
కలుగునా మోక్షం?

ఫిబ్రవరి 21, 2009 at 6:28 సా. 4 వ్యాఖ్యలు

కల

నీ రాకను తెలుసుకున్న కొంటె గాలి
మల్లె తీగను గిల్లుతూ వీచెను
ఆ మల్లె తీగ ఓరగా వాలి
తన పూలను నవ్వుతూ రాల్చెను
వెచ్చని నీ పాద స్పర్శతో తుళ్ళుతూ
ఆ పూలు చివరి క్షణాన్ని ఆస్వాదించెను
నిన్ను తాకే సూర్య కిరణాలను చూసి
ఈర్షపడిన మేఘమాల
సూర్యున్ని అడ్డగించి
కురిపించెను చిరుజల్లు
నీ తడి మోము చూచి
చిన్నబోయెను హరివిల్లు
ఇదంతా చూసిన నేను
నవ్వుతూ నిద్రలేచాను 🙂

ఫిబ్రవరి 17, 2009 at 3:00 సా. 4 వ్యాఖ్యలు


Blog Stats

  • 4,565 hits

లంకెలు

ఫిబ్రవరి 2009
సో మం బు గు శు
1234567
891011121314
15161718192021
22232425262728