Archive for జూన్, 2009

మరో మారు…

స్పర్శతో కందిపోయే సంపద…
నీ లేత చెక్కిళ్ళు !!
వాస్తవానికీ తలంపుకీ తేడా తెలియదే…
నీ సొగసు నా కనులకు పెట్టేను గిలిగింతలు !!
నీ వాలు కనులు…
నీలి వర్ణానికే వన్నె తెచ్చాయి !!
బ్రతుకు ఒక శాపం బానిసకి…
అనుకుంటిని నేను.
కానీ ఆ బానిస నా మనసే అయితే…
అది నీ రూపానికే అయితే…
జీవితమే ఓ యోగం !!
మరు జన్మకై పడేను ఆరాటం !!
కాలం ఆగిపోతే బాగుండు…
నిను చూస్తుండిపోవచ్చు !!
నా మనసు తెల్ల కాగితమైంది…
నీ చిత్రం గీసేందుకు !!
నీ పేరు నా ఊపిరిలో…
అలిపిరి కొండలా పేరుకుపోయింది !!
కవిత, అతిశయోక్తి, కలగలిసి ఎందుకు ఉంటాయో…
అర్ధం అయ్యేది కాదు నాకు…
నిన్ను చూసేంత వరకు !!
నిను చూడగానే ప్రాస తన్నుకొచ్చింది…
మది ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసింది…
ఇప్పటివరకు జీవించే ఉన్నానా అనిపించింది…
ప్రేమని పిచ్చితో ఎందుకు పోలుస్తారో తెలిసింది !! 😉

మరో మారు తారసపడితే నువ్వు…
స్తంబించిపోయే గుండె కూడా స్పందిస్తుంది !!
ఇంకో క్షణం కొట్టుకుంటుంది !!

జూన్ 15, 2009 at 10:38 సా. వ్యాఖ్యానించండి


Blog Stats

  • 4,565 hits

లంకెలు

జూన్ 2009
సో మం బు గు శు
 123456
78910111213
14151617181920
21222324252627
282930