Archive for జనవరి, 2009

మూడు మాటలు…

అయిపోయింది…
మళ్లీ అయిపోయింది….
జ్ఞాపకాల వలయంలో మరో ఏడు గడిచిపోయింది…
కాలమనెడి గాలులకు కదలాడని మోడులా
కెరటావేశానికి అడ్డు నిలిచిన రాతి తీరంలా
గతాన్ని, గత గుర్తులని..
చెరపలేక, మరువలేక…
గుండెను పురమాయించడానికి ప్రయత్నిస్తూ
వెలితిని పూరించటానికి వెదుకులాడుతూ
వెంటపడు జ్ఞాపకాలను తరిమి కొడుతూ
వెనుదిరిగి చూడదలచిన మనసుని వారిస్తూ
ఉప్పెనలా వస్తున్న వాక్ప్రవాహాన్ని దిగమింగుతూ
మూడు మాటలు బయటకు వచ్చాయి…
పెగలని గొంతును ధ్వనింపజేస్తూ
అలుముకున్న మౌనాన్ని ఛేదిస్తూ

“నూతన సంవత్సర శుభాకాంక్షలు”

జనవరి 2, 2009 at 5:28 సా. 2 వ్యాఖ్యలు


Blog Stats

  • 4,565 hits

లంకెలు

జనవరి 2009
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031