Archive for అక్టోబర్, 2008

నా తీపి ఙ్ఞాపకం – 2

ఊహలకు ఊపిరి పోస్తే
వచ్చేను నీ సుందర రూపం
ఊసులకు మాటలు వస్తే
పలుకును నీ మధుర నామం
నువ్వు లేని కలను కనలేవు నా కనులు
నీ పేరు పిలువకుంటే మూగబోవును నా పెదవులు
పసిడి వెలుగుల దీపావళి లా
పాల నురుగుతో పొంగే కడలి లా
కల కాలం కాంతులీనే దేవత లా
ఉండాలి నువ్వు నా చిన్న కవిత లా

ఉండాలి నువ్వు నా తీపి ఙ్ఞాపకం లా

అక్టోబర్ 27, 2008 at 4:40 సా. 3 వ్యాఖ్యలు

నా తీపి ఙ్ఞాపకం

నేనెన్నటికీ మరువలేనిది
నీ మధుర నామమే
ఎల్లప్పుడూ నేచూదదలిచేది
నీ చిరు దరహాసమే
నీ సమక్షం లో ప్రతి క్షణం
మరువనన్నది నా హృదయమే
నా గుండె లయలో పదిలపరుచుకుంది నీ రూపమే
నీ కొంటె చూపుల ఊబి లో
చిక్కుకున్నది నా ప్రాయం
నువ్వు లేని తరుణం
వ్యర్ధమవును కదా నా ప్రాణం

అక్టోబర్ 27, 2008 at 4:21 సా. వ్యాఖ్యానించండి


Blog Stats

  • 4,565 hits

లంకెలు

అక్టోబర్ 2008
సో మం బు గు శు
 1234
567891011
12131415161718
19202122232425
262728293031