మంచు!

మెల్లగా నేల రాలింది…
తెల్లగా అల్లుకుంది….
మబ్బులా కాదు… పొగ మంచులా!

ఆకాశమంతా నిండినది!
కొత్త కాంతితో…

నేలకొరిగి నవ రూపాన్ని అద్దినది!
స్వేతాక్షత బిందువులతో…

ఆ వర్ణము వర్ణించే రాగమై..
నటనమాడెను..భువనవీణపై!

లావణ్యానికి అర్ధం తెలుపుతూ…
మునుపు లేని గిలిగింత పెట్టినది!

ఆ మంచు తునకలు కరిగినా…
ఆ ఛాయలు కనుమరుగయినా…
ఆ చూపులు పదిలమై ఉండును!
ఈ నయనమున!!
కనువిందుగ కొలువుండును!
ఈ హృదయమున!!

ఆగష్టు 23, 2011 at 12:13 పూర్వాహ్నం 2 వ్యాఖ్యలు

ఆ క్షణం…

నీ తలపులు నా తనువీణను మీటుతుంటే…
నీ జ్ఞాపకాల గునపం గుండెను గిల్లుతుంటే…
దూరమవుతున్న తరుణం వేదనే ఓదార్పునీయునా?
ఆశలు అడియాశలవుతున్న వేళ…
చెంతకొచ్చావు చల్ల గాలిలా!
కలల తీరానికి దర్శనం ఇస్తావని…
నా నిరీక్షణ కడతేరుతున్న క్షణం…
చూస్తుండిపోయాను నీ రూపం!
నా చూపుల సంద్రంలో ధూళి నిండినదో ఏమో…
చేమ్మగిల్లెను చూపులు!!
మసకబారిన కళ్ళకు ఓపిక లేక…
మునివేళ్ళ సాయం కోరెను!
నీ రూపాల కాంతులు నా నయనాలను చేరడానికి!!
చేరి చిరకాలం చెరిగిపోకుండా ఉంటే…
నా గుండెలోతుల్లో ప్రతిధ్వనించే నినాదం…
‘గెలుపు నాదే!’ :)

మార్చి 19, 2011 at 11:19 పూర్వాహ్నం 16 వ్యాఖ్యలు

కాలం సాగిపోతుంది…

ప్రతీ పదం పలుకబడదు…
ప్రతీ భావం కనపడదు
ప్రతీ క్షణం మదిలో నిలువదు

కాలం సాగిపోతుంది…
సాగిపోతూనే ఉంటుంది…

కొన్ని సార్లు మెల్లగా మారవచ్చు…
ఏదైనా జరగడానికి మనం వేచియున్నప్పుడు…
ఆ నిరీక్షణలో మునిగితేలడానికి!!

ప్రతీ పదం పలుకబడదు…
ప్రతీ భావం కనపడదు
ప్రతీ క్షణం మదిలో నిలువదు

ఏకసంతాగ్రహి అయినా ఏకాగ్రతతో
కార్య సిద్ధికై కృషిచేస్తున్నా
కొన్ని సార్లు కాలమే వంచించును!!

కాలం సాగిపోతుంది…
సాగిపోతూనే ఉంటుంది…

కాబట్టి…
కనుమరుగవ్వని క్షణాలు నెమరువేసుకుంటూ…
గుండెలోతుల్లో ప్రతిధ్వనించే పదాలు పలకాలి!
గత వైభవం గుర్తుచేసుకుంటూ…
అమూల్యమైన ఆలోచనలు రాసుకోవాలి!
మధురోన్నత భావాలను తలచుకుంటూ…
మరో కావ్యమే వెలికితీయాలి!
పాత రోజులను తిరిగి చూసుకోవాలి!!
ఒక గాధలా మలుచుకోవాలి!!

ఆనాడు.. ఈనాడు.. ఏనాడూ..
చరిత్రలో చిరకాలం నిలిచిపోవాలి!!

జనవరి 22, 2011 at 11:25 అపరాహ్నం 2 వ్యాఖ్యలు

తొలి పొద్దు

పొద్దే ‘పొడిచెను’ చీకటి రేయిని…
నిదురించే నడి రేయిని!
హద్దే చెరిపెను భూ మర్మముకు…
అందమైన మృదు మర్మముకు!
ముద్దు పెట్టెను ప్రకృతి నుదుటిపై సింధూరంలా…
విరిసే ఎర్రని ముద్ద మందారంలా!
చంద్రున్నే మరిపించే వెలుగులతో…
కోటి వెలుగులతో…
దిద్దేను పుత్తడి వర్ణము నింగి వెలుపల!
అలలు పారగా… కోకిల పాడగా…
నవోదయమే పిలిచెను వెచ్చగా!
కలలే కడ తేరెను కనులెదురుగా…
వాయువేగంతో ఎగిరి వచ్చిన వాన మేఘంలా!
కలలు దాటి వచ్చెను ఆశల సవ్వడి…
చిటపట రాలిన చిరు చినుకులా!
ఆ ఆకాంక్ష చేసెను సందడి…
కొంటె భాషలో కొత్త బాసలా!

అక్టోబర్ 27, 2010 at 4:18 అపరాహ్నం 9 వ్యాఖ్యలు

చిత్ర లేఖనం – 5, 6

జులై 11, 2010 at 6:00 అపరాహ్నం మీ ఉద్దేశ్యం…

ఉదయ కాంతిలా..

ఉదయ కాంతిలా
హృదయ లయలు…
పల్లవించెను పాటలా
మధువులూరే గానమై
మెదలసాగెను స్వరములో
స్మృతులే..
సంకృతులుగా
(ఉదయ..)
————————–
కనుల వాకిట విచ్చేసిన
కలలే అలలుగా
చేరెను తీరము
జీవనది తీరము!
నిదుర సంద్రమునించి
నిజ జీవితముకు..
అలుపు మాని గెలుపు కొఱకు!!
(ఉదయ..)
—————————
నింగికెగసే ఆశలే
నేర్పుచుండెను ఓర్పునే
మదిలోని మృదు బాసలే
మారుచుండెను ప్రాసలా!
కంఠమే కావ్యమవగా
ఆలకించుము ఈ గాత్రమును!!
(ఉదయ..)
—————————
హృదయపు కాగితముపై
ఊసుల వర్ణము కల్గిన కలముతో
వ్రాయసాగెను మరో గ్రంధమిలా
మోయలేని స్తోత్రములే
మరువలేని పురానముగా
ఇంకిపోయేట్లు లిఖించెను
ఈ కవి లిఖించెను

జులై 9, 2010 at 2:32 అపరాహ్నం మీ ఉద్దేశ్యం…

చెక్కిలి దాహం

నీ తలపులు నా వాకిట తలుపులు తడుతుంటే

సంతోషం ఒక పక్క
బాధ మరో పక్క

ఆనందం ఎందుకంటే …

నిన్నింతలా ప్రేమించే హృదయం…
నీ మరపురాని జ్ఞాపకాలు…
నా చెంతనున్నందుకు!
దుఃఖం ఎందుకంటే …
వీటన్నిటికీ మూలం ఐన నీవు
నన్నింతలా మార్చి
ఇంత ధైర్యం ఇచ్చిన తరువాత
నను వదిలి వెళ్ళినందుకు!
ఇచట లేనందుకు!!
అటువంటి తరుణం …
చూసుకుంటే నా ప్రతిబింబం …
రోదించనంది ఈ నయనం!!
కంట తడి రాని క్షణం
తీర్చేది ఎవరు చెక్కిలి దాహం?

ఏప్రియల్ 14, 2010 at 7:31 పూర్వాహ్నం 2 వ్యాఖ్యలు

చిత్రలేఖనం – 3, 4

మరో ఆదివారం…మరో బొమ్మకి శ్రీకారం :)

బొమ్మ

బొమ్మ

పోయిన వారం గీసిన బొమ్మ :

బొమ్మ

బొమ్మ

ఫిబ్రవరి 15, 2010 at 12:21 పూర్వాహ్నం 2 వ్యాఖ్యలు

నా గిటార్

3 IDIOTS – ‘Give me some sunshine’ పాట గిటార్ మీద ఆదివారం నేను వాయించినప్పుడు record చేసిన video ఇది. ఈసారి video upload చేసే సరికి ఇంకా బాగా వాయించాలని నా ఆశ, కోరిక, తపన :)

ఫిబ్రవరి 4, 2010 at 12:15 పూర్వాహ్నం 6 వ్యాఖ్యలు

జో.. జో..

చుట్టూ ఉన్న ప్రపంచం తిరుగుతుంది…
మెదడులో ఆలోచనల అలజడి రేగుతునే ఉంది!
పరుగులు తీసే పగలైనా,
నిదురించే నడి రేయి అయినా…
ఈ అలజడి రేపే గోలను ఆపలేవు!
చెంతనుంటే ఆత్మీయులు,
దూరమైతే జ్ఞాపకాలు…
ఊసులు మరపించే తలపులై
ఈ హృదయపు తలుపులను
తట్టి కొడుతూ… ఉంటే…
చిచ్చు కొడుతూ జోల పాడుతుందో,
చిచ్చు రేపే పెను గోలలా వేధిస్తోందో,
దిక్కు తోచక…
తలుపు తెరవలేక…
పాపం పసి హృదయం!
నిద్ర పట్టక తల్లడిల్లింది!!

అప్పుడే అనిపించింది…
పెను జ్వాలకైనా ఆయువు పోసేది వాయువే అని!!
తనలోకి తొంగిచూడగా…
ఆశావాదాన్ని, ఆనందాన్ని
అపనమ్మకం, అనుమానం
హరించి వేస్తున్నాయని!
ధైర్యం కూడగట్టుకుని
బెదురుపాటుని దహించి వేస్తే…

మురిపించే తలపులతో
నవోదయ తేజస్సుని వీక్షిస్తూ…
చిరునవ్వులు మరళ చిగురించెను!
నిశ్శెబ్దాన్ని ప్రతిధ్వనిస్తూ
కునుకు వేశెను చిన్ని హృదయము :)

ఫిబ్రవరి 2, 2010 at 8:45 అపరాహ్నం 2 వ్యాఖ్యలు

Older Posts


Blog Stats

  • 2,795 hits

లంకెలు

వర్గములు

ట్యాగులు

Guitar Poem sketch song story

 

జనవరి 2012
సో మం బు గు శు
« ఆగ    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

ఇటీవలి జాబులు


Follow

Get every new post delivered to your Inbox.